కనీస ప్రమాణాలు పాటించాలి

13 Dec, 2014 01:07 IST|Sakshi

ఎమ్మెల్సీ నాగేశ్వర్
 నారాయణపేట : ప్రభుత్వ విద్యావిధానంలో కనీస ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డా.కె.నాగేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలేపల్లి ఫంక్షన్‌హాల్‌లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రథమ విద్యా మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలకు తొలిరోజు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ‘బంగారు తెలంగాణ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరి తపిస్తున్నదన్నారు. ఈ కల సాకారానికి బంగారం లాంటి చదువు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలకు అక్షరాస్యత, ప్రభుత్వ విద్య బలోపేతంపై చిత్తశుద్ధి లేనందున ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్నారు.
 
  ఆరేళ్ల క్రితం సీఎం నేతృత్వంలో ఏర్పాటు చేసి న ‘సాక్షరత మిషన్’కు తనను కూడా ఒక సభ్యుడిగా నియమించినా ఇంతవరకు ఒక్క సమావేశం జరగలేదన్నారు. మిషన్ విధివిధానాలు ఏమిటో కూడా తెలియవన్నారు.  కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇందు కు రూ. 25 కోట్లు కేటాయించి అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారేగా ని, ఇంతవరకు నిపుణుల బృందాన్ని ఏ ర్పాటు  చేయ లేదన్నారు. విద్యారంగ అభివృద్ధి జరగనిదే బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ప్రతి ఉపాధ్యాయుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయూలన్నారు.
 
  పిల్లల్లో ప్రశ్నిం చే, ఆలోచించే తత్వాన్ని చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నా రు. ఉపాధ్యాయుడు తరగతి గదిని ప్ర పంచానికి అనుసంధానం చేయాలని, ప్రపంచ విషయాలను పరిచయం చేసినప్పుడే శాస్త్రీయ విద్యావిధానం వస్తుం దన్నారు. ఎమ్మెల్సీ పొతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసమే కాకుండా బాధ్యతల విషయంలోనూ ముందుండాలన్నారు. రాష్ట్రంలో తొలి యూటీఎఫ్ విద్యా మహాసభల చర్చలు, అభిప్రాయాలు, తీర్మానాలు రేపటి భవిష్యత్ బాగుకు, బంగారు తెలంగాణ కలల సాకారానికి ఉపయోగపడాలన్నారు.
 
  ప్రభుత్వం ఉచిత నిర్బం దవిద్య అమలుకు కృత నిశ్చయంతో ఉందన్నారు.మహాసభ ఆహ్వాన సం ఘం అధ్యక్షుడు, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య మాట్లాడుతూ వెనకబడిన ‘పేట’ డివిజన్‌లో విద్యా సదస్సును నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. పెట్టుబడిదారి, బాలకార్మికుల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయలోకమేనన్నారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నేత శివకుమార్‌రెడ్డి,  కృష్ణభగవాన్, చావరవి,  కిష్టయ్య, రఘుపాల్, సంయుక్త,  విజయ్‌కుమార్, వెంకటప్ప, వెంకట్రామరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు