నాన్‌వెజ్‌ నడిచొస్తుంది..

11 Dec, 2019 03:52 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: ఇకమీదట మటన్, చికెన్, మాంసాహార ఉత్పత్తులు (పచ్చళ్లు) కొనుగోలు దారుల ఇంటి వద్దకే వస్తాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇర్కొడు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తయారు చేసిన చికెన్‌ పచ్చళ్లు, శుభ్రమైన, ఆరోగ్యకరమైన చికెన్, మటన్‌ సరఫరా వాహనాన్ని (మీట్‌ ఆన్‌ వీల్స్‌) మంగళవారం సిద్దిపేట కూరగాయల మార్కెట్‌లో జాతీయ మాంసం ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ వైద్యనాథ్‌తో కలసి ప్రారంభించారు.

పల్లెపల్లెకూ ఈ వాహనం తిరిగి విక్రయాలు జరపనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇర్కొడులో తయారవుతున్న నాన్‌వెజ్‌ పచ్చళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.  ఇది రాష్ట్రంలోనే తొలి వాహన మని చెప్పారు.

మరిన్ని వార్తలు