మై ఓట్‌..  నాట్‌ ఫర్‌ సేల్‌!

2 Dec, 2018 15:30 IST|Sakshi
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న  చైతన్య నినాదం ఇదే  

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నినాదం

షాద్‌నగర్‌ టౌన్‌: ‘మై ఓట్‌ నాట్‌ ఫర్‌ సేల్‌’ అనే చైతన్య నినాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏ ముంది ప్రత్యేకత అనుకుంటున్నారా ఇది ఎన్నికల సంఘం రూపకల్పన చేసినట్లు ముద్రించి ఉంది. ఈ నినాదం అధికారిక పిలుపు అయితే ఇదొక శుభపరిణామం.

ఓటు కోసం ఐదు వందల రూపాయలు ఇస్తుండగా తిరస్కరిస్తున్నట్లు అర్థం వచ్చేలా తీర్చిదిద్దడంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. చూసిన చాలా మంది ఇతర వ్యక్తులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నారు.

అంతేకాకుండా అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి చాలా మంది వాట్సాప్‌ స్టేటస్‌ ఫొటో ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నినాదాలు అందరిని ఆకట్టుకోపోయినా కొందరైనా నీతి, నిజాయితీగా ఓటు వేసేలా దోహదపడే ఆస్కారం కచ్చితంగా ఉంటుంది. 


ప్రచార మాధ్యమాల్లో ప్రమాణ సందేశాలు 
.... అన బడే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, నోటుకు, మధ్యానికి, కులానికి, మతానికి సంక్షేమ పథకాలకు లొంగకుండా విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటానని ప్రమాణం చేస్తున్న సందేశాలు ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నారు.

ఇలాంటి తరహా సందేశాలు ప్రజాస్యామ్యానికి ఎంతో అవసరం అనే అభిప్రాయాలను చాలా మంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు