గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు

22 May, 2020 19:46 IST|Sakshi

మిస్టరీగా మారిన గీసుకొండ ఘటన

సాక్షి, వరంగల్‌ :‌ జిల్లాలోని గీసుకొండ బావి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా బలవంతంగా వారిని బావిలో తోశారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. అయితే తొలుత బావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కాగా శుక్రవారం ఉదయం మరో ఐదు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యా.. ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసుల విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు తేలిసిన వివరాల ప్రకారం బయటపడిన 9 మృతదేహాల్లో ఆరుగురు మక్సూద్ కుటుంబసభ్యులే కాగా.. మిగిలిన ముగ్గురు ఎవరనేది మిస్టరీగా మారింది.  (చినిగిన వలస బతుకులు!)

స్థానికుల సమాచారం ప్రకారం ఇటీవల ఎం.డీ.మక్సూద్‌ ఆలం మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్ విషయంలో బిహార్ యువకులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గురువారం రాత్రి నుంచి బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం నుంచి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మక్సూద్‌ కూతురితో వీరికి ఏమైనా సంబంధం ఉందా..? ఘటనకు వివాహేతర సంబంధం కారణమా? పుట్టినరోజు వేడుకలో జరిగిన గొడవలే కారణమా? ఇతర కుటుంబ కలహాలు కారణమా? కనిపించకుండా పోయిన ఇద్దరు బిహార్ వ్యక్తులు ఎక్కడా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (బాలికను గర్భవతి చేసిన 70ఏళ్ల వృద్ధుడు)

ఈ క్రమంలోనే యాకూబ్‌పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల విచారిస్తున్నారు. శ్యాం, రాంలు వీరందరిని హత్య చేసి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుండగా వీరందరిపై విషప్రయోగం జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీపీ రవీందర్ మాట్లాడుతూ..  పారిపోయిన ఇద్దరు బిహార్ వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నామని తెలిపారు. ఘటనపై పలు అనుమానాలున్నాయని, విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

మృతుల వివరాలు..

1)మాసూద్ అలం (50)
2)నిషా అలం భార్య (45)
3)బూస్రా అలం (22) (కూతురు) 
4)3 సంవత్సరాల బాబు 
5)శబాజ్ అలం (21) కొడుకు
6)సోహిల్ అలం (20) కొడుకు
7) షకీల్ (40) డ్రైవర్ 
8) శ్రీరామ్ (35) తోటి కార్మికుడు
9) శ్యామ్ (40) తోటి కార్మికుడు

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు