సింగరేణి సీఎండీగా శ్రీధర్

30 Dec, 2014 00:37 IST|Sakshi
సింగరేణి సీఎండీగా శ్రీధర్

సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండుమూడు రోజుల్లో ఆయనను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ గతంలో అనంతపురం, వరంగల్, కృష్ణా జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కార్యాలయం లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన శ్రీధర్ 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇదివరకు సింగరేణి సీఎండీగా ఉన్న సుతీర్థ భట్టాచార్య కోల్ ఇండియా సీఎండీగా ఎంపిక కావడంతో.. ఆయన స్థానంలో శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించడం, అందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నియామకం ఓకే అయింది.
 

మరిన్ని వార్తలు