తాగునీటికి కటకట

8 Apr, 2018 10:56 IST|Sakshi
బైక్‌పై నీటిని తెస్తున్న యువకుడు

పట్టణంలో తీవ్రమైన నీటి ఎద్దడి 

ప్రైవేట్‌ ట్యాంకర్లద్వారా కొనుగోలు చేస్తున్న ప్రజలు 

ప్రత్యామ్నాయంపై దృష్టిసారించని పాలకులు 

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌ : జిల్లా కేంద్రంలో తాగునీటికి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్ట్‌లు వరద నీటితో కళకళలాడుతున్నా కందనూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో మాత్రం చుక్కనీరు లేదు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం తీస్తున్న అండర్‌గ్రౌండ్‌ కెనాల్‌ కాలువల వల్ల జిల్లా కేంద్రం, పరిసర గ్రామాల్లో బోరు బావులన్నీ ఊట తగ్గాయి. రామన్‌పాడ్‌ నీటి సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో నీటి కష్టాలు పెరిగాయి. ఒక్కో ట్యాంకర్‌ రూ.600 నుంచి రూ.700 పెట్టి మరీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మధ్య తరగతి కుటుంబం సైతం ఒక్కో ట్యాంకర్‌ మూడు రోజులు సైతం రావడం లేదని, ఇలా నెలసరి కూలి డబ్బులు మొత్తం నీటి కోసమే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసరి సముద్రం ఎండిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి.  

తాగునీటికి తప్పని తిప్పలు 
కేసరిసముద్రం పరిదిలోని పరిసర గ్రామాలైన ఎండబెట్ల, చర్లిటిక్యాల, తిర్మలాపూర్, ఇంద్రకల్, పులిజాల, చందాపూర్, గగ్గలపల్లి, మల్కాపూర్‌ తదితర గ్రామాల్లోని రైతుల పొలాల్లో నీటూట తగ్గిందని రైతులు వాపోతున్నారు. కాగా నీటి వసతికి అనుగునంగానే పంటలు వేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా అవుతున్నా ఈగ్రామాల వారికి మాత్రం ఫలితం అందలేదు. రామన్‌పాడ్‌ పథకం ఉన్నా  జిల్లాకు వచ్చే వాటా నెలరోజులుగా సక్రమంగా రావడం లేదు. 

ఇదీ పరిస్థితి : జిల్లా కేంద్రంలో 26వేల 801 పైచిలుకు ఉన్న జనాభాకు 3600 మంది పబ్లిక్‌ నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో నగర పంచాయతీ పరిధిలో 36 బోర్లు ఉన్నాయి. ప్రతిరోజూ 13 లక్షల 50వేల లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం 4 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతున్నాయి. నెల రోజులుగా రామన్‌పాడ్‌ నీరు కూడా సరఫరా కాకపోవడంతో నీటి కొరత మరీ తీవ్రతరం అవుతోంది. ప్రతినిత్యం ఇతర ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్న వారి సంఖ్య 50 శాతం పైబడి ఉన్నారు. 

వారం నుంచి నీళ్లు వస్తలేవు..  

శ్రీనగర్‌ కాలనీలో నల్లా నీరు రాక వారాలు గడుస్తున్నాయి. దగ్గర్లో చేతిపంపులు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తె చ్చుకుంటున్నాం. ప్రతినెలా రూ.5వేల పైచిలుకు నీటి కోసమే ఖ ర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇకనైనా స్పందించి ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేస్తే బాగుంటుంది.

మరిన్ని వార్తలు