‘మూసీ’ కష్టాలు తీరేదెప్పుడో..!

16 May, 2017 16:22 IST|Sakshi
‘మూసీ’ కష్టాలు తీరేదెప్పుడో..!
అర్వపల్లి(తుంగతుర్తి):  మూసీ నదిలో వరద పారిందంటే చాలు.. అటు నకిరేకల్, ఇటు తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు రవాణా కష్టాలు వచ్చినట్లే. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చినప్పుడు నదిలో రాకపోకలు స్తంభిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో మూడ్రోజులుగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రజలు నడుముల్లోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ 365వ నంబర్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా.. మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే జాజిరెడ్డిగూడెం – వంగమర్తి మధ్య మూసీపై కిలోమీటరున్నర దూరం వంతెన నిర్మించనున్నారు. వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే ఇంజనీరింగ్‌ అధికారులు మట్టి నమూనాలు సేకరించి అంతా ఓకే చెప్పారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజల ఎదురుచూస్తున్నారు.
 
 
మరిన్ని వార్తలు