ఆ.. క్షణాలను మరిచిపోలేను 

8 Sep, 2019 10:20 IST|Sakshi
ప్రధాని నరేంద్రమోదీతో నమృతతో పాటు చంద్రయాన్‌ వీక్షణకు ఎంపికైన విద్యార్ధులు

అందరూ ఊపిరి బిగపట్టి చూశారు.. ప్రధానితో కరచాలనం చేశాను

ప్రయోగం విజయవంతం కాకపోవడంతో చాలా బాధపడ్డాం 

చంద్రయాన్‌ –2ను వీక్షించిన మెట్టు నమ్రత వెల్లడి

సాక్షి, కోదాడ : చంద్రయాన్‌–2 వీక్షణం కోసం శుక్రవారం రాత్రి ఇస్రో కేంద్రంలో గడిపిన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేనని కోదాడలోని తేజ విద్యాలయకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మెట్టు నమృత అన్నారు. శనివారం బెంగళూరునుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో నమ్రత మాట్లాడింది. చంద్రయాన్‌–2ను ఆమె ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వీక్షిం చింది. అక్కడ గడిపిన క్షణాలు, అనుభూతులు ఆమె మాటల్లోనే.. ఇస్రో ఆన్‌లైన్‌లో నిర్వహించిన క్విజ్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఎంపికయ్యాను. గురువారం బెంగళూరు చేరుకున్న మాకు ఇస్రో సెంటర్‌లో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మమ్ములను ఇ స్రో టెస్టింగ్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఆడిటోరియానికి తీసుకువచ్చారు.

అక్కడకు 9 గంటలకు ప్రధాని మోదీ వచ్చి నాతో పాటు అక్కడకు వచ్చిన 76 మంది విద్యార్థులతో దాదాపు గంటసేపు గడిపారు. ప్రతి ఒక్కరితో ఆయన కరచాలనం చేయడంతోపాటు శాస్త్రవేత్తలుగా రాణించి దేశానికి సేవ చేయాలని కోరారు. అనంతరం మమ్మళ్లీ చంద్రయాన్‌ ప్రయోగం వీక్షించేందుకు సెం ట్రల్‌ హాల్‌కు తీసుకెళ్లారు. రాత్రి రెండు గంటల వరకు ప్రధాని అక్కడే ఉ న్నారు. రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకు తీవ్రమైన ఉత్కంఠను చవిచూశాం. అందరం ఊపిరి బిగపట్టి చూశారు. కానీ ప్రయోగం విజయవంతం కాకపోవడంతో చాలా బాధపడ్డాం. అందరిలోనూ ఒకరకమైన ఆవేదన కనిపించింది. రెండు గంటలకు ప్రధాని వెళ్లి పోయారు. రాత్రి మూడు గంటలకు అక్కడినుంచి మేము విడిది చేసిన ప్రదేశానికి  వెళ్లాం అని చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు