ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీలో మరో 16 మంది..!

18 Jul, 2018 18:30 IST|Sakshi
ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ నిందితులు (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ కుంభకోణంలో నిందితులు వాసుబాబు, శివ నారాయణ గత కొంత కాలంగా సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. కాగా, కోర్టు నిందితులిద్దరికీ 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది.  తమ విచారణలో కేసుకు సంబంధించి కీలక సూత్రధారిని గుర్తించినట్లు సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడించారు.

ఒక కార్పొరేట్‌ సంస్థకు చెం‍దిన కీలక వ్యక్తికి  ఈ లీకేజీ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేసుతో ఎవరెవరికి సంబం‍ధాలున్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఆరు క్యాంపులు నిర్వహించామనీ,  మరో 16 మందికి ఈ కేసులో ప్రమేయం ఉందని గుర్తించినట్టు సీఐడీ పోలీసులు వెల్లడించారు.  మరో నిందితుడు మెడికో గణేష్‌ ప్రసాద్‌ను వారం రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్‌ వేసింది. వాసుబాబు, శివ నారాయణలు శ్రీచైతన్య, నారాయణ విద్యాసం‍స్థల్లో ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు