తొలిపూజ నేనే చేస్తున్నా: నరసింహన్‌

2 Sep, 2019 13:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌ భారీ గణనాథుడిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ ఏడాది ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమిచ్చిన మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ...తాను గవర్నర్ అయినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకొని తొలి పూజ చేస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేవారికి సకల శుభాలు కలుగుతాయన్నారు. వినాయకుడి ఆశీస్సులతో బంగారు తెలంగాణ... రత్నాల తెలంగాణ అవుతుందని ఆకాంక్షించారు.మరోవైపు ఖైరతాబాద్‌ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పలువురు వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా భారీ సంఖ్యలో గణనాథుడి చెంతకు చేరుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనితా నాగేందర్ స్వామి వారికి వెండితో తయారు చేసిన 75 అడుగుల జంధ్యాన్ని సమర్పించారు. అదే విధంగా లంగర్‌హౌస్‌కు చెందిన భక్తులు 750 కిలోల లడ్డూను మహాగణపతికి నివేదించారు. పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ ఆధ్వర్యంలో 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలను స్వామి వారికి అలంకరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీసుల అదుపులో హేమంత్

ఈనాటి ముఖ్యాంశాలు

సతీష్‌ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు

హామీల అమలులో సీఎం విఫలం 

రాజన్న యాదిలో..

వైఎస్సార్‌ గొప్ప నాయకుడు: కోమటిరెడ్డి

అభివృద్ధిపై వైఎస్సార్‌ ముద్ర

వినాయకుడిని పూజించే 21 రకాల పత్రాలు

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

జలయజ్ఞ ప్రదాత వైఎస్సార్‌

పగ పెంచుకొని.. కత్తితో దాడి 

సరోగసీ.. అథోగతి.

రాజన్న యాదిలో..

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

పండగ వేళ విషాదం

మానేరు.. జనహోరు

‘మాయమాటల టీఆర్‌ఎస్‌ సర్కారు’

ప్ర‘జల’ మనిషి వైఎస్సార్‌..

వైరల్‌ : కాళ్లు మొక్కినా కనికరించలే.. 

ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి

బతుకమ్మ చీరలొచ్చాయ్‌..

కిరణ్‌..కిరాక్‌

పెరిగిన గ్యాస్‌ ధర

మండపాల వద్ద జర జాగ్రత్త!

మరపురాని మారాజు

గౌలిగూడ టు సిమ్లా

భూగర్భం..హాలాహలం!

రైతుల గుండెల్లో ‘గ్రీన్‌ హైవే’ గుబులు

హరితహారం మొక్కను మేసిన ఎడ్లు.. శిక్షగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!