నమస్కార్‌ జీ.. మై మోదీ!

23 Apr, 2020 13:24 IST|Sakshi
ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడుతున్న మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి  

బీజేపీ సీనియర్‌ నేతలకు ప్రధాని పలకరింపు

వరంగల్‌లో ఇద్దరు నాయకులకు ఫోన్‌

హన్మకొండ: బీజేపీ సీనియర్‌ నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్‌ చేసి యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు. జనసంఘ్‌ కాలం నుంచి ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగుతున్న నాయకులతో మోదీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చందుపట్ల జంగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డితో బుధవారం ప్రధాని మాట్లాడారు. కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ మేరకు జంగారెడ్డి పార్టీ అభివృద్ధిలో సీనియర్‌ నాయకుల పాత్రను వివరించడంతో పాటు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తెలిపారు.

ఇక సత్యనారాయణరెడ్డికి ఫోన్‌ చేయగా... ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి.. ఇప్పుడు ప్రధాని హోదాలో మీరు మాట్లాడారని చెప్పారు. అనంతరం ఇరువురు నాయకుల ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ లాక్‌డౌన్‌ అమలుపై ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నుంచి ఫోన్‌ రావడంతో తాము ఆశ్చర్యపోయాయని.. ఇది తమకు మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ నుంచి...
బీజేపీ నాయకులకు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఫోన్‌ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సీనియర్‌ నాయకులకు ఫోన్‌ చేసి కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉంది.. జిల్లాల్లోని పరిస్థితులు ఆరా తీసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారని తెలుసుకున్నారు. బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్‌ రూరల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌ రెడ్డితో పాటు పలువురికి ఆయన ఫోన్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా