ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

27 Nov, 2019 10:27 IST|Sakshi

సాక్షి, మంధని: పెద్దపల్లి  జిల్లాలో  బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి -అడవిశ్రీరాంపూర్ సమీపంలో  ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప‍్రమాదంలో  పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... మంథని నుండి ముత్తారం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను దర్యాపూర్ మోడల్ స్కూల్‌కు తీసుకువెళ్లే ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్  అజాగ్రత్త వల్ల బస్సు రోడ్ కిందికి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులతోపాటు పది మంది ప్రయాణికులు మొత్తం 70 మంది ఉన్నారు.  బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పినప్పటికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎల్బీనగర్‌లో కారు బీభత్సం..
ఎల్బీనగర్‌ సమీపంలో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు...రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ డివైడర్‌ను ఢీకొంది. గాయపడ్డ వెంకటమ్మ, సత్తమ్మలను చికిత్స నిమిత్తం ఓజోన్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు