చేసిన పనులే గెలిపిస్తాయి

6 Dec, 2018 15:50 IST|Sakshi

గ్రామాల్లో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్న జనం 

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో 

ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం

నర్సాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి 

గ్రామాల్లో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్న జనం 

నర్సాపూర్‌:  గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి చేపట్టిన అభివృద్ధి, పనులే కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలోని పేదలకు మేలు చేసే పథకాలు తనను ప్రస్తుత ఎన్నికలలో గెలిపిస్తాయని నర్సాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసినందున ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తాను ఎన్నికల ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇంటింటి ప్రచారంలో సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. చాలా చోట్ల  హారతులు ఇచ్చి ఆదరించారని ఆమె చెప్పారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుఖాయమనీ పేర్కొన్నారు. 


చేరికలతో బలం పెరగింది.. 
ప్రజల నుంచి ఆదరణ నిండుగా ఉందని అన్నారు.  నియోజకవర్గంలోని అన్ని గ్రామాలో ఇంటింటి ప్రచారం చేశామని ఆమె తెలిపారు. కాగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారని నాయకులు కార్యకర్తలు ఈసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలన్న తపనతో ఉన్నారని అందుకు అనుగుణంగా గట్టిగా కృషి చేశారని ఆమె చెప్పారు. కాగా తాము ప్రతిపక్షంలో ఉన్నా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని వారి చేరిక తమకు మరింత బలాన్ని చేకూర్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.   


ప్రజలకు మేలు చేసే అంశాలతో మేనిఫెస్టో..  
ప్రజల ఆదరణ, కార్యకర్తలందరి కృషి ఫలితంగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా తాను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని ఆమె చెప్పారు. మేనిఫెస్టోలో వృద్ధ దంపతులిద్దరికి పింఛను, దళితులకు ఉచిత కరెంటు, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రేషన్‌ షాపుల ద్వారా ఒక్క రూపాయికే ఏడు కిలోల సన్న బియ్యంతో పాటు ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపరిష్కారానికి ప్రాధాన్యత తదితర అంశాలన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలతో పోలిస్తే  కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ను ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి చెందే విధంగా ఉన్నందున నియోజకరవ్గంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారి పేర్కొన్నారు.  


చేసిన పనులే గెలిపిస్తాయ
తాను ఏ గ్రామానికి ప్రచారానికి  వెల్లిన  బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటామని, తనను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని సునీతారెడ్డి చెప్పారు.  తనకు ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీతోనే పోటీ ఉంటుందని సునీతారెడ్డి  పేర్కొన్నారు. కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలు తన విజయానికి దోహదపడుతాయని ఆమె చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌  పాలనను గాలికొదిలేసి సచివాలయానికి రాకుండా ఇంటి నుంచి పరిపాలన సాగించడంతో రాష్ట్రంలో పరిపాలన సరైన దిశగా సాగనందున  ప్రజలలో వ్యతిరేకతను పెంచిందని ఆమె చెప్పారు.  


సీఎం ఒక్కసారి కూడా రాలేదు.. 
నర్సాపూర్‌ను సీఎం దత్తత తీసుకుంటున్నట్లు గత ఎన్నికలప్పుడు ప్రకటించి ఒక్కసారైనా నియోజకవర్గంలో పర్యటించకపోవడం విచారకరమని అన్నారు. కాగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చనందున ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతతో ఉన్నారని ఆమె చెప్పారు.  తమ పార్టీ ఇచ్చిన  హామిలు నెరవేర్చుతుందని ప్రజలలో నమ్మకం ఉందని తాము ఏ హామీ ఇచ్చిన నెరవేరుస్తామని ఆమె చెప్పారు.  కాగా ప్రస్తుత  ఎన్నికలలో తాను గెలుస్తానని  గెలిచాక నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కోంటున్న సమçస్యలను గురింతచి పరిష్కరిస్తానని, మేనిఫెస్టోలోని పథకాలు పకడ్బందీగా అమలు చేయించి ప్రజలకు చేరేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు