ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!

4 Sep, 2019 15:03 IST|Sakshi

ఢిల్లీ: తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించింది. అయితే సుమారు నాలుగు కోట్ల పది లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా.. ఎలా తవ్వుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో పూడికతీతలో భాగంగా ఇసుకను తీశామని తెలిపింది. కాగా అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు పూరైనప్పటికీ.. వాటిలో పూడికతీత ఎలా సాధ్యమైందని నిలదీసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి చట్టం ఏర్పాటు చేయలేదా అని ఎన్జీటీ మండిపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు