గ్రేటర్‌కు జాతీయ స్థాయి అవార్డు

14 Apr, 2018 13:34 IST|Sakshi

మెరుగైన పొడి చెత్త నిర్వహణపై గుర్తింపు

అభినందించిన గ్రేటర్‌ మేయర్, కమిషనర్‌

వరంగల్‌ అర్బన్‌: ‘చెత్తా చెత్త కాదు రీ సైకిల్‌ చేస్తే మళ్లీ వినియోగపడుతోంది.. చేయి చేయి కలుపుదాం.. చెత్తపై సమరం సాగిద్దాం..’ అంటూ 2012 అక్టోబర్‌ నెలలో ఇంటింటా ప్రారంభమైన తడిపొడి చెత్త సేకరణకు అవార్డుల పంట పండుతోంది. 2012 అక్టోబర్‌లో దేశంలోనే మొదటి సారిగా అప్పటి కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ నేతృత్వ్యంలో సాగిన క్లిన్‌ సిటీకి ప్రశాంస పత్రాలు, అవార్డులు, రివార్డుల జోరు కోనసాగుతోంది. తాజాగా గ్రేటర్‌ వరంగల్‌కు రెడ్యూస్, రీ సైకిల్, రీయూజ్‌లో జాతీయ స్థాయిలో గ్రేటర్‌ వరంగల్‌కు ఆర్‌–3 అవార్డు దక్కింది.

సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌ మెంట్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన 8వ రీజినల్‌ 3 ఆర్‌ ఫోరమ్‌ ఇన్‌ ఏసియా అండ్‌ ద పసిఫిక్‌ సదస్సు ఈనెల 8 నుంచి 12 వరకు జరిగింది. ఈ సదస్సులో గ్రేటర్‌ వరంగల్‌ జాతీయ స్థాయిలో పొడి చెత్త నిర్వహణలో 3వ స్థానంలో నిలిచింది. ఆవార్డును ఈ–శ్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు స్వీకరించినట్లు గ్రేటర్‌ ఎంహెచ్‌ఓ రాజారెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరంగల్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికేట్, 4 ఐకాన్‌ ఎస్‌డబ్ల్యూఎం 2014, గ్రీన్‌ లీప్‌ 2013, బెస్ట్‌ శానిటేషన్, క్లిన్‌ ఎర్త్‌ తదితర అవార్డులను సొంతం చేసుకుంది. అవార్డు రావడంపై గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, కమిషనర్‌ వీపీ.గౌతమ్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బందిని, ఈ–శ్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులను అభినందించారు.

మరిన్ని వార్తలు