కరోనా ఎఫెక్ట్‌: ట్రైనీ ఐపీఎస్‌ల ఔట్‌డోర్‌ శిక్షణ రద్దు

19 Mar, 2020 20:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసుల సం​ఖ్య పెరుగుతున్న క్రమంలో నేషనల్‌ పోలీసు శిక్షణ అకాడమీ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్రైనీ ఐపీఎస్‌ అధికారులకు ఔట్‌డోర్‌ శిక్షణను రద్దు చేసింది. ప్రస్తుతం ఎన్‌పీఏలో 229 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారు. ఐపీఎస్‌ల శిక్షణ అకాడమీలోనే కొనసాగనుందని అధికారులు తెలిపారు. కానీ, ఐపీఎస్‌లకు సంబంధించిన వారు శిక్షణ అకాడమీలోకి ప్రవేశించడానికి అనుమతి లేదన్నారు.

లోపలి వాళ్లు బయటకి, బయటి వాళ్లు లోపలికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వైరస్‌ నివారణ కోసం సానిటైజర్లు, మాస్క్‌లు ఇతర జాగ్రత్తలను నేషనల్‌ పోలీసు శిక్షణ అకాడమీ అధికారులు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు