ముగిసిన నేషనల్‌ కోటా ‘ఎంబీబీఎస్‌’ దరఖాస్తు ప్రక్రియ 

25 Jun, 2019 02:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ కోటాలో భర్తీ చేయనున్న ఎంబీబీఎస్‌ సీట్ల తొలి విడత దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈనెల 19 నుంచి 24 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు సమయమిచ్చారు. విద్యార్థుల ఆప్షన్లు, ర్యాంకులు, కేటగిరీలవారీగా అందుబాటులో ఉన్న సీట్ల ఆధారం గా, సీట్లు కేటాయించి ఈ నెల 27న అలాట్‌మెంట్‌ వివరాలను వెల్లడించనున్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి జూలై 3వ తేదీలోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్లను జూలై 9 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే, ఏ రాష్ట్రంలోని సీట్లను ఆ రాష్ట్రాలకు బదిలీ చేస్తారు.   

>
మరిన్ని వార్తలు