మొక్కలే అతడి ప్రాణం..

10 Jul, 2018 14:31 IST|Sakshi
వేర్లతో తీసిన చెట్లను నాటిస్తున్న వన ప్రేమికుడు ఇంద్రసేనారెడ్డి

అనువుగాని చోట ఉన్న  చెట్లకు సంరక్షణ

వేర్లతో తీసి మరోచోట నాటిన వనప్రేమికుడు

నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన ఓ వన ప్రేమికుడు అనువుగాని చోట పెరుగుతున్న చెట్లను సంరక్షిస్తున్నాడు. వివరాలలోకి వెళ్తే... గ్రామానికి చెందిన పరుపాటి ఇంద్రసేనారెడ్డికి చెట్లంటే ప్రాణం.

ఈ మేరకు అనువుగాని చోటైన తాటి చెట్ల కొమ్మల్లో పెరుగుతున్న చెట్లకు ప్రాణం పోస్తున్నాడీ వనప్రేమికుడు. పాము చంద్రయ్య, అమ్మ వెంకన్నల సహాయంతో 20 చెట్లను వేర్లతో తీసి అనువైన ప్రదేశాలలో నాటేందుకు సిద్ధపడ్డాడు.

అందులో భాగంగానే గ్రామంలోని ప్రధాన వీధుల వెంట, కస్తూర్భాగాంధీ గురుకులం, ప్రభుత్వం పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయాలలో నాటించారు. ఆయన కృషిని గుర్తించిన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు