రేపు ‘నాయీ’ ఆత్మీయ సదస్సు

12 Oct, 2019 08:33 IST|Sakshi
గోపాలకృష్ణ, రమేశ్‌, సుధాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: నాయీ బ్రాహ్మణుల దసరా ఆత్మీయ సదస్సు(అలయ్‌ బలయ్‌) ఆదివారం ఆబిడ్స్‌లోని హోటల్‌ మందాకిని జయ ఇంటర్నేషనల్‌లో జరగనుంది. నాయీ జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్‌, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల ఐక్యమత్యానికి, సృహృద్భావ సంబంధాల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు