సిద్దిపేటకు నెక్లెస్‌ రోడ్డు

8 Nov, 2019 08:59 IST|Sakshi
నెక్లెస్‌ రోడ్డు మోడల్‌

మార్చి వరకు పూర్తి చేయాలి

కలెక్టరేట్‌లో అర్కిటెక్ట్‌ 

ప్రజెంటేషన్‌లో మంత్రి హరీశ్‌

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మినీ ట్యాంక్‌ బండ్‌ కోమటి చెరువుపై ప్రత్యేకంగా నెక్లెస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సిద్దిపేటలో నిర్మించనున్న  ఈ రోడ్డు నిర్మాణంపై ప్రముఖ అర్కిటెక్ట్‌ సంవాద్‌ ప్రధాన్‌ రూపొందించిన విజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను  ఆయన కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, జిల్లా అదికారులతో కలిసి వీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సిద్దిపేటలో నిర్మించనున్న నెక్లెస్‌ రోడ్డు ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కలిగేలా విజన్‌కు అనుగుణంగా నిర్మాణం ఉండాలని, తన డ్రీమ్‌ ప్రాజెక్టుపై రూపకల్పన చేసి, సిద్దిపేట నెక్లెస్‌ రోడ్డు అంటే రోల్‌ మోడల్‌గా నిలిచేలా ఉండాలని అధికారిక వర్గాలను ఆదేశించారు.

కలెక్టర్‌తో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నెలలోపు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజెంటేషన్‌లో చిన్నా, పెద్దలకు సరదాగా గడిపేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని, అక్కడక్కడా ఎత్తు వంపులతో మంచి అనుభూతి కలిగించేలా ఉండాలన్నారు. నెక్లెస్‌ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏ,బీ,సీ,డీ,ఈ  జోన్లుగా విభజించనున్నామన్నారు. చెరువు కట్ట కిలోమీటర్‌ ఉండగా, నిర్మించే నెక్లెస్‌ రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్‌ ఉండనుందన్నారు. అదేవిదంగా పాత, కొత్త కట్టలను కలుపుతూ రెండున్నర కిలోమీటర్లు రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును రూ.25 కోట్లతో నిర్మించనున్నట్లు, మొదటగా సీ, డీ జోన్ల పనులు యుద్ధప్రాతిపాదికన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ లక్ష్మణ్, మున్సిపల్‌ ఇంజనీర్లు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌

10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

నేటి విశేషాలు..

బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు

డెంగీ కేసుల్లో కారేపల్లి మొదటి స్థానం

డాక్టర్‌ మంజులా రెడ్డికి ఇన్ఫోసిస్‌ అవార్డు

‘ఇండియా జస్టిస్‌’లో మహారాష్ట్ర టాప్‌

ఇంటికి జియో ఫెన్సింగ్‌

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర

సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు

దెబ్బ తగలని పార్క్‌

నకిలీ వీసాలతో మోసాలు

రోల్‌మోడల్‌గా ఎదగాలి

ఆది ధ్వనికి... ఆతిథ్యం

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

చలో ట్యాంక్‌బండ్‌ మరో మిలియన్‌ మార్చ్‌

ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?

‘ఆ భూ వివాదంతో సంబంధం లేదు’

‘మీ నిర్ణయాల వల్లే ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది’

ఈనాటి ముఖ్యాంశాలు

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

ఆర్టీసీ సమ్మె:ఇలాంటి అధికారులను చూడలేదు: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె; నమ్మకద్రోహంపై మండిపాటు

ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్‌కు భయం: మందకృష్ణ

ఓ బాటసారీ.. నీకో దారి

చలో ‘భారత్‌ దర్శన్‌’.. పూర్తి వివరాలు

‘కల్యాణ’ కమనీయం ఏదీ.?

క్విక్‌ రెస్పాన్స్‌

రెవె‘న్యూ’ సవాళ్లు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ