పార్టీ ప్రతిష్ట పెంచాలి

16 Mar, 2016 02:26 IST|Sakshi

{పజలకు అందుబాటులో ఉండండి
సమన్వయంతో పనిచేయండి
కొత్త కార్పొరేటర్లకు కడియం దిశానిరేశం


హన్మకొండ అర్బన్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో పత్య్రేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కడియం మాట్లాడు తూ.. అవినీతి అక్రమాలకు, భూకబ్జాలకు దూరంగా ఉంటూ నీతివంతమైన పాలన అందించాలని సూచిం చారు. జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రత్యేక  దృష్టి ఉందని, దానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ వరంగల్ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జట్‌లో రూ.300 కోట్లు కేటాయించిందని, ప్రతి ఏటా ఇదే విధంగా నిధులు వస్తాయని చెప్పారు. కార్పోరేషన్‌పై ప్రజల్లో సదభిప్రాయం లేదని, దానికి తొలగించేలా పాలన సాగాలని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు.

పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన వారు పార్టీలో అవకాశాలు దక్కక అసంతృప్తితో ఉన్నవారిని కలుపుకుని పోవాలని సూచించారు. కార్పరేటర్‌గా సమర్ధవంతంగా పనిచేసినవారికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. తాను, ఎంపీ గుండు సుధారాణి కార్పొరేటర్లుగానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించామని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ డివిజన్ కేంద్రాల్లో కార్పొరేటర్లు ప్రజలకు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల మధ్య ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీలు సీతారం నాయక్, పసునూరి దయూకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, శంకర్‌నాయక్, పుల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు