బీజేపీ సీనియర్‌ నాయకుడి మృతి

2 Mar, 2020 09:23 IST|Sakshi
పార్టీ కార్యాలయంలో నివాళర్పిస్తున్న బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు

మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి శిష్యుడు

నివాళులర్పించిన బీజేపీ నాయకులు

జనగామ : మృధుస్వభావి, మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి శిశ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లుట్ల నర్సింహారావు ఆదివారం తెల్లవారు జాము గుండె పోటుతో మృతి చెందారు. జనగామ నియోజక వర్గ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నెల్లుట్ల 2004లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని  పోతూ ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. నియోజకవర్గం నుంచి రాష్ట్రం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నర్సింహ్మారావుకు కొద్దిరోజుల్లో నామినేటెడ్‌ పోస్టు వరించనున్న నేపథ్యంలో హఠార్మరణం అభిమానులను కలచివేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న వందలాది మంది హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు.

బీజేపీ సీనియర్‌ నాయకులు నర్సింహ్మారావు

జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కౌన్సిలర్‌ మహంకాళి హరిశ్చంద్రగుప్త, నాయకులు కొంతం శ్రీనివాస్, వెంకట్, ఉడుగుల రమేష్, బొమ్మకంటి అనిల్, ఆగయ్య, సౌడ రమేష్, దేవరాయ ఎల్లయ్య, బొక్క ప్రభాకర్, జగదీష్, మహిపాల్, ఉపేందర్, పిట్టల సత్యం, సంపత్, వినోద్, తిరుపతి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌డీ అతిథి గృహం ఆవరణలో నెల్లుట్ల చిత్రపటానికి మండల అధ్యక్షులు తిరుపతి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్, మార్క ఉపేందర్, మహేష్, నిమ్మల మధు, ముక్క స్వామి, రాజశేఖర్, కాంగ్రెస్‌ నాయకులు గుండ శ్రీధర్‌రెడ్డి నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా