‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’

26 Apr, 2017 17:46 IST|Sakshi
‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి పదవికి లక్ద్మారెడ్డి అనర్హుడని కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలింతలు సరైన వైద్యం అందక చనిపోతుంటే ప్లీనరీ పేరుతో ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

టీఎస్‌ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కోఠి మెటర్నిటీ మరణాలకు సూపరిండెంట్ శైలజ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు
మరిన్ని వార్తలు