‘ఖమ్మం బార్‌’ ను ఎప్పటికీ మరువను

23 Jun, 2018 15:40 IST|Sakshi
మాట్లాడుతున్న రామచంద్రరావు

సాక్షి, ఖమ్మం లీగల్‌ : ఖమ్మం జిల్లాతో, ఖమ్మం బార్‌తో తనకు విడదీయలేని బంధం ఉందని, ఖమ్మం బార్‌ను ఎన్నటికీ మరువనని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌ రావు అన్నారు.  శుక్రవారం ఖమ్మం జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులని, ప్రతి క్షణం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను విశేషంగా ఆదరించి.. తన విజయానికి సహకరించారని పేర్కొన్నారు.

             బార్‌, గ్రంథాలయ అభివృద్ధి కోసం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి రూ.లక్ష మంజూరు చేయించడమే కాకుండా చెక్కును బార్‌కు అందజేసినట్లు తెలిపారు. అనంతరం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎన్‌.రామచందర్‌రావును బార్‌ అసోసియేషన్‌ ఈపీ, సీనియర్‌ న్యాయవాదులు ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, ప్రధాన కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, పూసా కిరణ్‌, మర్రి ప్రకాష్‌, పబ్బతి రామబ్రహ్మం, సీనియర్‌ న్యాయవాదులు జి.సత్యప్రసాద్‌, మలీదు నాగేశ్వరరావు, వెంకట్‌గుప్తా, తల్లాకుల రమేశ్‌, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు