‘స్కూళ్లను స్వాధీనం చేసుకున్నా అభ్యంతరం లేదు’

17 Dec, 2016 00:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్‌ ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశా లల యాజమాన్యాల సంఘాలు శుక్రవారం విడుదల చేసిన ఓ సం యుక్త ప్రకటనలో పే ర్కొన్నాయి. గురువారం ఫీజల నియంత్రణ విషయంపై నిర్వహించిన సమా వేశంలో కిషన్‌ బెదిరింపు ధోరణిని ప్రదర్శించారని యాజమాన్య సంఘాల ప్రతినిధులు ఎస్‌.శ్రీని వాస్‌రెడ్డి, శేఖర్‌రావు, ఎస్‌ఎన్‌రెడ్డి, పాపిరెడ్డి తెలిపారు.

నోట్లరద్దుతో ఎదురవుతున్న సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలతో పలు ఇబ్బందు లు పడుతున్నామని డైరెక్టర్‌కు మనవి చేశామని అయితే, ఈ సందర్భం గా ‘మీరు నడపలేకపోతే మీ బడుల ను స్వాధీన పరచుకొని నేనే నడపుతాన’ని తమను బెదిరిం చినట్లు పేర్కొన్నారు. మా బడులను స్వాధీ న పరుచుకుంటే తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. విద్యారంగంలో అనుభవంలేని కిషన్‌ వల్ల విద్యారంగానికి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు