త్వరలో గొల్ల, కురుమల భవన శంకుస్థాపన

13 Dec, 2017 02:50 IST|Sakshi

పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి తలసాని పిలుపు  

సాక్షి, హైదరాబాద్‌: గొల్ల, కురుమల సంక్షేమ భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గొల్ల, కురుమలు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన గొల్ల, కురుమ సంఘాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.

గొల్ల, కురుమల సంక్షేమ భవనం కోసం 10 ఎకరాల భూమి, రూ. 10 కోట్లు మంజూరుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని అన్నారు. దీనిలో 5 ఎకరాలు గొల్ల కులస్తులకు, మరో 5 ఎకరాలు కురుమ కులస్తులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి గొల్ల, కురుమలు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గొర్రెల సమాఖ్య ఫెడరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్, భిక్షపతి యాదవ్, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు