తెరపైకి కాంగ్రెస్‌ కొత్త ముఖాలు

17 Mar, 2019 16:20 IST|Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థిత్వంలో మారుతున్న సమీకరణలు

రహీంసైఫీని రంగంలోకి దింపిన పార్టీలోని ఓ వర్గం

చివరకు బరిలో నిలిచేది మధుయాష్కియేనా ?

సాక్షి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం పేరు ప్రముఖంగా వినిపించగా, తాజాగా రహీంసైఫీ పేరు తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ఈ పేరు వినిపిస్తుండటంతో ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీకి టీపీసీసీ పంపిన జాబితాలో గంగారాంతో పాటు, రహీంసైఫీ పేరును చేర్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రహీం చాలా ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో రహీంసైఫీకి సంబంధాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

హైదరాబాద్‌లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అభ్యర్థిత్వం ఎంపికలో రహీంసైఫీ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం వెనుక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు సీనియర్‌ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రహీంసైఫీ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ పార్టీలో మరో వర్గం నేతలు రగులుతున్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవా రం ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిం ది. మిగిలిన తొమ్మిది పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల జాబితాను శనివారం ఖరారు చేసే అవకాశాలున్నాయని భావించారు. కానీ ఎలాం టి ప్రకటన రాలేదు. ఆది, సోమ వారాల్లో ప్రకటించే జాబితాలో నిజామాబాద్‌ అభ్యర్థి పేరు ను ప్రకటిస్తారా.? లేక మరో ఒకటీ రెండు రో జులు వాయిదా వేస్తారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

చివరకు మధుయాష్కియేనా..?
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. భువనగిరి నుంచి బరిలోకి దిగాలని భావించిన ఆ యన ఆ స్థానం టికెట్‌ కోసం ప్రయత్నాలు చే శారు. అయితే భువనగిరి స్థానం కోమటిరెడ్డికి ఖరా రయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా యి. అక్కడి అభ్యర్థిత్వం దక్కకపోతే నిజా మాబాద్‌ బరిలో మళ్లీ మధుయాష్కే ఉండే అవకా శాలున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తా ను భువనగిరి నుంచి పోటీ చేస్తున్నానని, నిజా మాబాద్‌ స్థానం క్యాడర్‌కు ప రోక్షంగా సంకేతాలు పంపానని, ఇప్పుడు తి రిగి నిజా మాబాద్‌ నుంచి పోటీ చేయాల్సిన ప రిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది.. అని మధుయాష్కి ఆ యన సన్నిహితులతో చర్చించినట్లు తెలు స్తోం ది.

ఈ స్థానం అభ్యర్థిత్వం కోసం మధుయాష్కికి ప్రత్యామ్నాయంగా ప్రారంభంలో మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి, టి జీవన్‌రెడ్డి, మహేష్‌ కుమార్‌గౌడ్, షబ్బీర్‌అలీ తదితరుల పేర్లు వినిపించాయి. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరంతా చేతులెత్తేయడంతో అధిష్టానానికి అభ్యర్థిత్వం ఎంపిక సవాల్‌గా మారింది. మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ ఒకటీ రెండు రోజుల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

>
మరిన్ని వార్తలు