భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

16 Aug, 2017 11:56 IST|Sakshi
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ రైతును న్యూ డెమోక్రసీ సభ్యులు కొట్టి చంపారు. జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం పంచయాతి పరిధిలోని నర్సంపేటకు చెందిన రాయల భాస్కర్‌ అనే రైతును న్యూడెమోక్రసీ రవి దళ సభ్యులు దారుణంగా కొట్టి హతమార్చారు.
 
బుధవారం ఉదయం భాస్కర్‌ ఇంటికి వచ్చిన 20 మంది న్యూ డెమోక్రసీ సభ్యులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో 15 మంది మగ, ఐదుగురు మహిళ దళ సభ్యులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డిని ఇదే రవి దళం హతమార్చింది. 
మరిన్ని వార్తలు