సొసైటీ భూములపై నిఘాకు కొత్త చట్టం

20 Dec, 2016 02:32 IST|Sakshi

రెవెన్యూశాఖ జోక్యం చేసుకునేలా సహకార చట్టం–2016కి రూపకల్పన
సహకార భూముల్లో అక్రమాలు జరిగితే వెనక్కి లాగేసుకునే వీలు


సాక్షి, హైదరాబాద్‌: మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ (మ్యాక్స్‌) చట్టాన్ని కొత్త సహకార చట్టంలో కలిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ అనుమతి తీసుకుంది. దీనిపై సహకార శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు. వివిధ సొసైటీలు ఇళ్లు ఇతరత్రా అవసరాల కోసం తీసు కున్న భూముల్లో అక్రమాలు నెలకొంటే వాటిని కట్టడి చేయడానికి... ఆ భూములను తిరిగి వెనక్కు తీసుకోవడానికి రెవెన్యూ శాఖకు అవకాశం కల్పించాలని ప్రతిపాదిం చారు. భారీ మార్పులు చేర్పులతో నూతన సహకార చట్టం–2016 రానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముసాయిదా బిల్లును రూపొందిస్తారు. అవసరమైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేకుంటే వచ్చే సమావేశాల్లో  సహకార చట్టం–2016 ఉనికిలోకి రానుంది.

మ్యాక్స్‌తో అక్రమాల వెల్లువ...
సహకార చట్టం, మ్యాక్స్‌లు వేర్వేరుగా ఉన్నాయి. మ్యాక్స్‌ ద్వారా అనేక డెయిరీ, హౌసింగ్‌ తదితర సొసైటీలు పనిచేస్తు న్నాయి. వీటిల్లో అనేక సొసైటీలు అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. సొసైటీ లు అనేకం ప్రభుత్వ భూములను తీసుకొని అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలు న్నాయి. వాటిపై నియంత్రణే లేదు. కొన్ని హౌసింగ్‌ సొసైటీలు భూములు తీసుకొని అక్రమంగా అర్హత లేనివాళ్లకు కట్టబెడుతున్న ట్లు బయటకు పొక్కాయి. ఇలా సొసైటీల్లో జరిగే అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సహకారశాఖకు అవకాశం లేకుండా పోయింది. మ్యాక్స్‌లో సవరణలు చేసే బదులు దాన్నే సహకార చట్టంలో కలిపే యాలనేది సహకారశాఖ ఉద్దేశం. ఆ ప్రకారం నూతన చట్టాన్ని తీసుకురావాలనేది సర్కారు యోచన. కట్టుదిట్టంగా మార్పులు చేర్పులతో నూతన చట్టాన్ని తీసుకొస్తే కొన్ని సొసైటీల అక్రమాలకు బ్రేక్‌ వేసినట్లు అవుతుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు