గ్లోబరీనా తొలగింపు 

11 May, 2019 02:56 IST|Sakshi

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌కు కొత్త సంస్థ 

టెండర్లు ఆహ్వానించిన టీఎస్‌టీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల ప్రక్రియలో పొరపాట్లు చేసిన గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్‌ చేయాల్సి ఉంది.

ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగిం చకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్‌ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచింది. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్‌ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కోల్పోయింది.   

మరిన్ని వార్తలు