సకల హంగులతో పోలీస్‌ కార్యాలయం

4 Aug, 2018 10:20 IST|Sakshi
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎస్పీ చందనాదీప్తి

మెదక్‌ మున్సిపాలిటీ : జిల్లాలో నూతన పోలీస్‌ కార్యాలయం భవన నిర్మాణానికి ఎస్పీ చందనాదీప్తి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఔరంగాబాద్‌ గ్రామ శివారులో నూతనంగా జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 60 ఎకరాల్లో ఈ కార్యాలయ సముదాయం ఉంటుందన్నారు. ఈ మేరకు రూ. 25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ. 15కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మిగతా నిధులతో ఇందులో ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్, ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ అండ్‌ రెసిడెన్స్, పరేడ్‌ గ్రౌండ్, సిబ్బందికి సంబంధించిన బ్యారక్‌లు నిర్మించడం జరుగుతుందన్నా రు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఔరంగాబాద్‌ శివా రులో సమీకృత కలెక్టరెట్, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.

అయితే జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీసు కార్యాలయం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేయడం చర్చనీయాంశంగా మా రింది. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈఈ టి.విశ్వనాథం, ఏఈ సంజయ్, మెదక్‌ అదనపు ఎస్పీ నాగరాజు, మెదక్‌ రూçరల్‌ సీఐ రామకృష్ణ, హవేళిఘణాపూర్‌ ఎస్సై శ్రీకాంత్‌  పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా