తెలంగాణ వెలుగులు

1 Jun, 2016 23:45 IST|Sakshi

బొగ్గు ఉత్పత్తిలో నూతన రికార్డు
రిక్రూట్‌మెంట్లతో కొలువుల జాతర
కంపెనీ పనితనానికి అవార్డుల పంట
స్వరాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలో  సింగరేణి కంపెనీలో అనేక మార్పులు

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక మార్పులు చోటుచేసుకున్నారుు. ఈ రెండేళ్ల కాలంలో సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో కంపెనీ పురోగతిలో పయనిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించింది. ప్రధానంగా భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కావలసిన నూతన గనుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. కార్మికుల మెరుగైన ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహించింది. చాలా కాలం తర్వాత ఉద్యోగ నియూమకాలు చేపట్టింది. నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగిడిన సంస్థ జైపూర్‌లో చేపట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి దశకు చేరుకుంది. కంపెనీ మెరుగైన పనితనంతో పలు అవార్డులను దక్కించుకుంది. రాష్ర్ట అవతరణ దినత్సోవాన్ని పురస్కరించుకొని ఈ రెండేళ్లలో సింగరేణిలో చోటుచేసుకున్న ముఖ్య ఘట్టాలపై కథనం.    - గోదావరిఖని(కరీంనగర్)

 

 

రికార్డు స్థాయి ఉత్పత్తి
సింగరేణిలో 2013-14లో 50.47 మిలియన్ టన్నులు, 2014-15లో 52.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 2015- 16లో 60.38 మిలియన్ టన్నుల రికార్డు(18 శాతం అదనం) ఉత్పత్తితో చరిత్ర తిరగరాసింది. కంపెనీ రూ.వెయ్యి కోట్ల లాభాలకు చేరింది.

 
తెలంగాణ ఇంక్రిమెంట్

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కార్మికుల కు ఆగస్టు 2014న ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించారు. 62 వేల మంది కార్మికుల జీతభత్యా లు రూ.604 నుంచి రూ.2,200 పెరిగాయి.

 
డిపెండెంట్లకు పరిహారం పెంపు

గనుల్లో చనిపోయిన కార్మికుల డిపెండెంట్లకు, మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు వద్దనుకుంటే ఇంతకాలం ఇస్తూ వచ్చిన రూ.5 లక్షల పరిహారాన్ని రూ.12.5 లక్షలకు పెంచారు. మే 2015 నుంచి సింగరేణిలో అమలు చేస్తున్నారు.

 
3000 ఉద్యోగాలు

కొత్త రిక్రూట్‌మెంట్ మరచిపోయిన కంపెనీలో తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు నోటిఫికేష న్ల ద్వారా 3,000 ఉద్యోగులు భర్తీ చేసింది.

 
మెడికల్ కొలువులు

ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 3,100 మంది మెడికల్ డిపెండెంట్ కార్మికులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి.

 
లాభాల్లో పెరిగిన వాటా

కంపెనీ లాభాల్లో కార్మికులకు చెల్లించే వాటా 2013-14 ఆర్థిక సంవత్సరానికి ముందు 18 శాతం ఉండగా 20 శాతానికి పెంచి చెల్లించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ఒక శాతం పెంచి 21 శాతం చెల్లించారు.

 
మ్యాచింగ్ గ్రాంట్ రూ.20 లక్షలు

గనుల్లో ప్రమాదం వల్ల కార్మికుడు మృతి చెందితే గతంలో కార్మికుడికి కేవలం రూ.5 లక్ష లు ఎక్స్‌గ్రేషియా సంస్థ ఇచ్చేది. తాజాగా మ్యా చింగ్ గ్రాంట్ కింద రూ.20 లక్షలు పొందే అవకాశం కల్పించింది. గనిలో ఇతర కారణాలతో మృతిచెందే కార్మికులకు రూ.15 లక్షల మ్యాచిం గ్ గ్రాంట్ చెల్లింపు విధానం నవంబర్ 2015 నుంచి అమలవుతోంది.

 
సన్మాన ఖర్చుల పెంపు

ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల సన్మాన ఖ ర్చులను రూ.900నుంచి రూ.3,500లకు పెం చారు. అలవెన్సుల్లో 50శాతం, ఇన్సెంటివ్స్ పెరిగారుు.

 
‘సూపర్ స్పెషాలిటీ’ శిబిరాలు

సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి యాజమాన్యం, ఆయా వైద్యులతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. 18,500 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సమస్యలున్న రోగులను హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందించారు.

 
విద్యుత్ కాంతులు

కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సామర్థ్యాన్ని 1200 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకు పెంచారు. మరికొద్ది రోజు ల్లో 1200 మెగావాట్ల విద్యుత్ వెలుగులు తెలంగాణ రాష్ట్రంలో విరజిమ్మనున్నాయి.

 

‘ఆణిముత్యాలు’
సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు చూపేం దుకు ‘ఆణిముత్యాలు’ కార్యక్ర మం చేపట్టారు. సుమారు 40 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహించి కంపెనీ వ్యాప్తంగా 4వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు.


ప్రత్యేక అవార్డులు
కంపెనీ పనితనం మెరుగు పడడంతో 2015 ఫిబ్రవరి 24న టాప్ ఆస్సెన్సీ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అవార్డు, అదే ఏడాది ఏప్రిల్ 20న దుబాయిలో గోల్డెన్ పికాక్ అవార్డు, 2016 మే 1న బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు, మే 28న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు లభించింది. సింగరేణి పత్రిక, వీడియో చిత్రాలకు సైతం జాతీయ స్థాయి ఉత్తమ బహుమతులు వచ్చారుు.

 

మరిన్ని వార్తలు