ఫిల్మ్‌ నగర్‌ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు

12 Sep, 2019 20:21 IST|Sakshi

రూ.17.75 లక్షలు పలికిన వినాయక్‌ నగర్‌ లడ్డూ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్‌ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్‌ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్‌  బస్తీ వినాయక్‌ నగర్‌ గణపతి లడ్డూ ధర దాటేసి  సరికొత్త రికార్డును నమోదు చేసింది. 

ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కన్నా వినాయక్ నగర్ లడ్డూ ధర ఎక్కువ పలికింది.  బీజీపీ నేత పల్లపు గోవర్ధన్‌ ఈ లడ్డూను రూ.17.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానం దక్కించుకుంది. ఇక ఈ ఏడాది బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ 17.60 లక్షలు పలికింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు