‘కాలేజ్‌ పోరగాళ్లు’ సినిమా చిత్రీకరణ

31 Jan, 2018 15:14 IST|Sakshi
క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్న ఏసీపీ గౌస్‌బాబా


మంచిర్యాలఅర్బన్‌ : సింగరేణి కార్మికుల పిల్లలు హైదరాబాద్‌కు పై చదువులకు వెళ్లి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నారా లేదా అనే అంశంతో మంత్ర ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న కాలేజ్‌ పోరగాళ్లు సినిమా చిత్రీకరణ మంగళవారం పట్టణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. దర్శకుడు, నిర్మాత, కథ మాటల రచయిత అన్నం చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఏసీపీ గౌస్‌బాబా క్లాప్‌ కొట్టారు. మరో నాలుగు రోజుల పాటు మంచిర్యాల గోదావరి నది, క్వారీ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు అన్నం చంద్రశేఖర్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు