ఎత్తుకు పైఎత్తు! ప్రచారంలో అభ్యర్థుల కొత్త పోకడలు..

4 Dec, 2018 12:59 IST|Sakshi
దౌల్తాబాద్‌లో డిజిటల్‌ ప్రచారాన్ని తిలకిస్తున్న ప్రజలు

సాక్షి, దౌల్తాబాద్‌: ఎన్నికల పోరుకు సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతలు ఎత్తుకుపై ఎత్తులతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సమయాన్ని దష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గతంలో అభ్యర్థులు గ్రామాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లలో మాత్రమే ప్రచారం నిర్వహిస్తూ కులసంఘాల మద్దతుతో ముందుకు సాగేవారు.

గతానికి భిన్నంగా ప్రస్తుతం నేతలు ప్రతి ఓటరును కలిసే విధంగా కార్యకర్తలతో గ్రామాల వారీగా బందాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఎల్‌ఈడీడిజిటల్‌ వాహనాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలు ప్రచార రథాలు కళాబందాలు కరపత్రాల ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నారు.  


నియోజకవర్గంలో త్రిముఖపోటీ... 
కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుంది. దేశ రాష్ట్ర రాజకీయ నేతలతో సభలు, సమావేశాలు పెడుతూనే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచార సమావేశాలు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో ఇంటింటి ప్రచారాలు, మెనిఫెస్టోలు, కరపత్రాలు తీసుకపోతున్నారు.

సభలకు, సమావేశాలకు ప్రజలను తరలించడంలో డబ్బులు,మద్యం, భోజనాలు విచ్చలవిడిగా వ్యయం చేశారు. ఇవన్నీ చేసినా పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్ది నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చివర్లో కాసులు, మద్యం కురిపించాలని ఆలోచనతో ముందుకు పోతున్నారు.  


హైడ్రోజన్‌ బెలూన్లతో ప్రచారం
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు పట్టణా లు మండల కేంద్రాల్లో పోటాపోటీగా హైడ్రోజన్‌ బెలున్లు ఏర్పాటు చేశారు. మాస్,డిజిటల్‌ ఇతర ప్రచారాలు ఒక ఎత్తయితే పార్టీల మెనిఫెస్టోలు, సంక్షేమ పథకాలు ప్రజావ్యతిరేక విధానాలు,, గ్రామాల్లో రోజువారీగా చేసిన ప్రచారాలను వాట్సఫ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ సోషల్‌ మీడియాలో ప్రతి రోజు పోస్ట్‌ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు