నరేష్‌ హత్య కేసులో కొత్త మలుపు

27 Jul, 2017 02:44 IST|Sakshi
నరేష్‌ హత్య కేసులో కొత్త మలుపు
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంబోజు నరేష్‌–స్వాతి హత్య సంఘటన కొత్త మలుపు తిరిగింది. 86 రోజుల తర్వాత వెలుగు చూసిన నరేష్‌ అస్థికలు కొత్త అనుమానాలకు తెరలేపాయి. హత్యకు గురైన నరేష్‌కు సంబంధించిన ఆన వాళ్లు ఇప్పటివరకు పోలీసులు గుర్తించలేక పోయారు. నరేష్‌ హత్య కేసులో నిందితుడు చెప్పిన ఆధారాలతో పోలీసులు ముందుకు సాగారన్నా ఆరోపణలకు బలం చేకూరు తోంది. ప్రజాసంఘాలు, నరేష్‌ కుటుంబ సభ్యులు ముందు నుంచి పోలీస్‌ల తీరుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నరేష్‌ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బుధవారం ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి శివారు పరిధిలోని తుర్కపల్లి వద్రికళ బండ వద్ద బయటపడ్డాయి.

పశువులను మేపడానికి వెళ్లిన నరేష్‌ బాబాయ్‌ అనుమా నాస్పదంగా ఉన్న గోనె సంచి మూటను గుర్తించాడు. విషయం వెంటనే నరేష్‌ తల్లి దండ్రులకు తెల్పడంతో వారు సంఘటన స్థలంలో కనిపించిన ఎముకలతో కూడిన చినిగిపోయిన దుస్తుల ఆధారంగా నరేష్‌ అస్థికలేనని గుర్తించారు. శవాన్ని పడుకోబెట్టి కాల్చినట్లు అక్కడ ఉన్న ఎముకల ఆధారా లను బట్టి తల్లిదండ్రులు గుర్తించారు.  శరీరంపై ఉన్న పాయింట్‌ 75% కాలిపోగా మిగిలిన భాగం ఉంది. చెంతనే  పెట్రోల్‌ బాటిల్‌ అక్కడే ఉంది. 

 

మరిన్ని వార్తలు