మిషన్ భగీరథలో ఉద్యోగాలు అవాస్తవం

5 Sep, 2019 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్ భగీరథలో ఉద్యోగాలు అనే వార్తలు అవాస్తవం అని ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. సామాజిక మధ్యమాల్లో ప్రచారం అవుతున్న పోస్టు నకిలీదని పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారు. తప్పుడు వార్తను నమ్మి డబ్బులు కట్టి ఎవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

కాగ మిషన్‌ బగీరథలో ఉద్యోగాలు అంటూ ఓ నకిలీ నోటిఫికేషన్‌ కాపీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివిధ విభాగాల కింద మొత్తం 13530 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని అందులో పేర్కొన్నారు. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలను కూడా పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగులకు అర్హులని, అప్లికేషన్‌కు ఈ నెల 30 చివరి తేది అని నోటిఫికేషన్‌లో పేర్కొనబడింది. ఇందుకు గాను అభ్యర్థులు రూ.110 చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు పద్దతిని కూడా నోటిఫికేషన్‌లో ఉంది. అయితే అచ్చం ప్రభుత్వం విడుదల చేసినట్లుగా ఉన్న ఈ నోటిఫికేషన్‌ను చూసి చాలా మంది మోసపోతున్నారు.

మరిన్ని వార్తలు