మంత్రి పదవి చేపడతా

17 Oct, 2017 13:31 IST|Sakshi

పాలకుర్తి: రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి చేపడుతానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నల్ల నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ తాను ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోతానని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కష్టకాలంలో పాలకుర్తి ప్రజలు ఆదరించారన్నారు. పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకోవడానిఇక ఆశించిన విధంగా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు.

ఈ నెల 22న సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో టెక్స్‌ టైల్‌ పార్కు నిర్మాణం శంకుస్థాపనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు అందుబాటులోకి వస్తుండటంతో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు ముస్కు రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ వీరమనేని యాకాంతరావు,  వైస్‌ ఎంపీపీ గూడ దామోదర్, ఎంపీటిసిలు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా