మార్చి 26న ఎన్‌హెచ్‌ఆర్సీ బహిరంగ విచారణ 

27 Feb, 2020 03:50 IST|Sakshi

బాధితుల నుంచి వినతులు

ఫిర్యాదుల స్వీకరణకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మార్చి 26న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్‌ పోస్టు లేదా ఈ మెయిల్‌/ ఫ్యాక్స్‌ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in,  jrlawnhrc@nic.in మెయిల్‌ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్‌ చేయవచ్చన్నారు. రిజిస్టర్‌ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, మానవ్‌ అధికార్‌ భవన్‌ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్‌ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు