జడ్జి రవీందర్‌ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్‌

19 Apr, 2018 11:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మక్కా మసీదు కేసులో సంచలన తీర్పును వెల్లడించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌ రవీందర్‌ రెడ్డి రాజీనామాలో  కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఆయన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్‌ జస్టిన్‌ ఆమోదించలేదు. అంతేకాకుండా జడ్జి రవీందర్‌ రెడ్డి పెట్టుకున్న తాత్కాలిక సెలవును కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన గురురవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు.

కాగా  మక్కా మసీదు పేలుళ్ల కేసుపై సోమవారం ఉదయం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే జస్టిస్‌ రవీందర్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.  అనంతరం ఆయన తన రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు పంపించారు.  అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్‌ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. కాగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ప్రచారం జరిగింది.

మరిన్ని వార్తలు