మావోయిస్టుల టార్గెట్.. టీఆర్‌ఎస్‌ నేతలు!

7 Oct, 2018 16:17 IST|Sakshi

ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల దాడులకు అవకాశం..

పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిన ఇంటిలిజెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు దాడులు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటిలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు పోలీసు యంత్రాంగానికి పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఛత్తీస్‌గఢ్‌ లాంటి మావోయిస్టు ప్రాబల్యం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదివరికే పోలీస్‌ శాఖను హైఅలర్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన కొందరు నాయకులును టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తెలిపింది.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు మావోయిస్టులు సానుకూలంగా ఉన్నారంటూ సమాచారం. కాంగ్రెస్‌ నేతలపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా దండకారణ్యంలో గత రెండు నెలలుగా మావోయిస్టులు ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రచించనట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు  అలర్టుగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో మావోయిస్టుల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలకు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  


 

మరిన్ని వార్తలు