విషమంగా నిఖిల్, మన్ను కర్బంధ ఆరోగ్యం

13 Jul, 2019 10:43 IST|Sakshi
బాధితులను పరీక్షిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌

అంబర్‌పేట : తల్లిదండ్రుల మృతిని జీర్ణించుకుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వార కుమారుడు, కుమార్తె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. డీడీ కాలనీకి చెందిన పవన్‌కర్బంధ, నీలం కర్బంధ దంపతులు మృతి చెందడంతో వారి కుమారుడు నిఖిల్‌ కర్బంధ, కుమార్తె మన్ను కర్బంధ కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. బాధితులను గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరికి అందుతున్న వైద్యసేవలపై గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నిద్రమాత్రలు తీసుకొని ఎక్కువ సమయం గడిచిపోవడంతో వారు కోలుకోలేక పోతున్నారని, కొన్ని అవయవాలు చికిత్సకు స్పందించడం లేదన్నారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప వీరి ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమన్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వీరి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకునాక్నరు. 

సోదరులకు మృతదేహాల అప్పగింత...
పవన్‌ కర్బంధ, నీలం కర్బంధ మృతదేహాలను సికింద్రాబాద్‌లో ఉంటున్న వారి సోదరులు ఇంద్రా కర్బంధకు అప్పగించినట్లు అంబర్‌పేట పోలీసులు తెలిపారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్‌ స్మశానవాటికలో వారి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. 

మరిన్ని వార్తలు