నిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

17 Jul, 2020 14:04 IST|Sakshi

వేత‌నాలు పెంచాల‌ని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్) ఆస్ప‌త్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళ‌న చేప‌ట్టారు. వేత‌నాలు పెంచాల‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతూ అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌లో ప‌ని చేస్తున్న అకౌంటెంట్లు, క్ల‌ర్కులు శుక్ర‌వారం కోఠి ప‌బ్లిక్ హెల్త్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌నకు దిగారు. కోవిడ్ కాలంలో తీవ్ర ప‌ని ఒత్తిడితో ఇబ్బంది ప‌డుతున్నామ‌ని వారు వాపోయారు. త‌మ జీతాలు పెంచ‌క‌పోతే వ‌చ్చే నెల నుంచి స‌మ్మెకు వెళ‌తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు ఉస్మానియా ఆస్ప‌త్రిలోనూ త‌మ‌కు స‌రిగా జీతాలు చెల్లించ‌‌డం లేద‌ని అక్క‌డి పారామెడిక‌ల్‌, టెక్నిక‌ల్ సిబ్బంది ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అటు గాంధీ ఆస్ప‌త్రిలోనూ ఔట్ సోర్సింగ్‌ న‌ర్సులు ఆందోళ‌న‌కు దిగ‌గా ప్ర‌భుత్వం వారు కోరిన‌ ప‌లు డిమాండ్లు నెర‌వేర్చేందుకు అంగీక‌రించ‌డంతో స‌మ్మె ఆలోచ‌న విర‌మించి తిరిగి విధుల్లోకి చేరారు. (ఔట్‌ సోర్సింగ్‌ నర్సులకు రూ.25 వేల వేతనం)

(కరోనా కోరల్లో నిమ్స్‌!)

మరిన్ని వార్తలు