నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్

22 Apr, 2015 00:33 IST|Sakshi

 సూర్యాపేటరూరల్‌ః వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట మండలంలోని లక్ష్మీనాయక్‌తండా, దుబ్బతండా, రామన్నగూడెం, కే.టీ అన్నారం నుంచి వెదిరెవారిగూడెం గ్రామాలకు రూ.8 కోట్ల 25 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంబించి మాట్లాడారు. 60 ఏళ్లుగా ఆంధ్రాపాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం ఎంతో వెనుకబాటుకు గురైందన్నారు.
 
 ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.  చంద్రబాబు విద్యుత్ సమస్యను సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఆ కుట్రలను మనం తిప్పికొట్టగలిగామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసవిలో సైతం విద్యుత్ కోతలు లేకుండా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి కరెంటు ఇస్తోందన్నారు.  వచ్చే ఏడాది నుంచి రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేకుండా 24 గంటలు  సరఫరా చేస్తామన్నారు.  కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, సర్పంచులు ఒంటెద్దు వెంకన్న, సాయిని నాగేశ్వరరావు,  ధరావత్ భారతి,
 
 కాట సాని వెంకటరెడ్డి, పాముల హనుమంతు,ఎంపీటీసీలు బోళ్ల కరుణాకర్, ముక్కాముల పద్మ, ఎల్గూరి వెంకటేశం, చింత శ్రీనివాస్, నాయకులు గవ్వా ప్రతాప్‌రెడ్డి,  వై.వెంకటేశ్వర్లు, ఆవుల దయాకర్‌రెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, సూర వెంకన్న, కఠ్ల జగత్‌దాస్, బోళ్ళ శ్రావణ్‌రెడ్డి, ముక్కాముల సుమన్, పీఆర్ డీఈ కృష్ణమూర్తి, తహసిల్దార్ వెంకటేశం, ఎంపీడీఓ నాగిరెడ్డి, ఏఈ మనోహర్, కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు