అన్నదాతలకు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌

19 Jul, 2020 04:40 IST|Sakshi

రైతన్నలకు అండగా టీటా చొరవను ప్రశంసించిన వ్యవసాయ మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు అండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) రూపొందించిన టీకన్సల్ట్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్‌లో టీకన్సల్ట్‌ ప్రారంభించామన్నారు. ఈ యాప్‌ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు. టీకన్సల్ట్‌ అగ్రికల్చర్‌ అప్లికేషన్‌ను వానాకాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు.   పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా నిపుణులతో అనుసంధానం అయ్యారు.

ఈ యాప్‌నకు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జలపతిరావుతో టీకన్సల్ట్‌ ద్వారా సందేహాలు అడిగి తెలుసుకున్నారు.  రైతులు, అగ్రి సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ఆన్లైన్‌ సేవలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ మక్తాల మాట్లా డుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా వ్యవ సాయానికి సాంకేతికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్‌.కె.సంగమేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు