మహిళలను వేధిస్తున్న కీచకుడిపై నిర్భయ కేసు

30 Jan, 2016 22:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఐడీఏ బొల్లారంలో కూలీగా పనిచేస్తున్న అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కొత్తపల్లికి చెందిన అదె రంజిత్‌పై పోలీసులు నిర్భయ కేసును శనివారం నమోదుచేశారు. వాట్సప్ ద్వారా అశ్లీల వీడియోలు, చిత్రాలు చాలా మంది మహిళలకు పంపించడంతో పాటు, అర్ధరాత్రి సమయాల్లో అమ్మాయిలకు ఫోన్‌కాల్స్ చేసి వేధించేవాడని నగర షీ టీమ్‌ను పర్యవేక్షిస్తున్న క్రైమ్స్, షిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని అరెస్టు చేశామన్నారు. వివరాల్లోకి వెళితే...ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో రంజిత్ పనిచేస్తున్నాడు. పాకింగ్ సేవల కోసం వచ్చే కస్టమర్ల ఫోన్ నంబర్‌లలో మహిళల నంబర్‌లను తీసుకొని సేవ్‌చేసుకునేవాడు.

తరచూ వారికి ఫోన్‌కాల్స్ చేయడంతో పాటు అశ్లీల వీడియోలు, చిత్రాలు వాట్సప్ ద్వారా పంపించేవాడు. అయితే మహిళ ఫోన్‌కాల్ తీయగానే వేధింపులు చేయడం మొదలెట్టేవాడు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రంజిత్‌ను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. 354-ఏ(3), 292, 507 ఐపీసీ సెక్షన్లతో నిర్భయ యాక్ట్ నమోదుచేశారు. రిమాండ్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీది ఏకపక్ష ధోరణి

పాతబస్తీలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు

దేశానికే ఆదర్శం కావాలి- హరీష్‌రావు 

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

సభలు, ర్యాలీలకు అనుమతి లేదు

గుండాల ఎన్‌కౌంటర్ : విచారణ వాయిదా

కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

త్వరలోనే కోర్టా– చనాక బ్యారేజీ ప్రారంభం

'ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ'

విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!

వంతెన.. ఇంతేనా..? 

మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం

వరంగల్‌.. బెల్లం బజార్‌ !

కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు

ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు

గోదారి తగ్గింది..

నోటుకో ప్రత్యేకత..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..

ఆపరేషన్‌ ముస్కాన్‌లో ‘సై’

తెగని పంచాయితీ..

త్వరితం.. హరితం

సర్కారీ స్థలం.. వివాదాస్పదం!

బావిలో నక్కల జంట

ధార లేని మంజీర

‘నేను కేన్సర్‌ని జయించాను’

మెదక్‌లో ‘జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌’

టిక్‌టాక్‌ మాయ.. ఉద్యోగం గోవిందా!

పాలు పోయొద్దు .. ప్రాణాలు తీయొద్దు

రాళ్లపై 'రాత'నాలు

వికారాబాద్‌లో దారుణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

ఓరి దేవుడా..అచ్చం నాన్నలాగే ఉన్నావు : మలైకా

‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’

చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’