ఐఈఎస్‌ టాపర్‌ అమన్‌ 

11 Nov, 2018 03:28 IST|Sakshi
అంకిత్, ప్రభాత్‌ పాండే

సత్తాచాటిన నిట్‌–వరంగల్‌ విద్యార్థి 

36, 46 ర్యాంకులు కూడా ఈ కాలేజీ వారికే... 

మూడేళ్లుగా మావే రికార్డులు:డైరెక్టర్‌ రమణారావు 

సాక్షి, హైదరాబాద్‌ , కాజీపేట అర్బన్‌ : ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌)–2018లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)–వరంగల్‌ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్‌ టాపర్‌తో పాటు మరో రెండు అత్యుత్తమ ర్యాంకులతో రికార్డు సృష్టించారు. శనివారం ఐఈఎస్‌–2018 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో నిట్‌–వరంగల్‌ విద్యార్థి అమన్‌జైన్‌ నేషనల్‌ టాపర్‌గా నిలిచాడు. అమన్‌ నిట్‌–వరంగల్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో 2016లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

ఇదే కాలేజీ నుంచి అంకిత్‌ (ఎలక్ట్రికల్‌) 36వ ర్యాంకు, ప్రభాత్‌ పాండే (ఎలక్ట్రికల్‌) 46వ ర్యాంకు సాధించారు. గతేడాది ‘గేట్‌’లోనూ తమ విద్యార్థి నేషనల్‌ టాపర్‌గా నిలిచారని నిట్‌–వరంగల్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణారావు ‘సాక్షి’తో తెలిపారు. క్యాట్, జీఆర్‌ఈల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. మూడేళ్ల నుంచి వరుసగా రికార్డులు సాధిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు