కాస్త ఇసుక ఉంటే ఇస్తారా..! : కలెక్టర్‌

6 Sep, 2019 10:57 IST|Sakshi
నిజామాబాద్‌ కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు, సంగారెడ్డి కలెక్టర్‌ ఎం.హన్మంతరావు

మా వద్దే లేదు.. మీకెక్కడి నుంచి ఇవ్వాలి..?

సంగారెడ్డి, నిజామాబాద్‌ కలెక్టర్ల ఉత్తర ప్రత్యుత్తరాలు

‘‘మీ జిల్లాలోని ఇసుక క్వారీల నుంచి కాస్త ఇసుక ఇవ్వండి..’’  
– ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు పక్షం రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావుకు రాసిన లేఖ సారాంశం. 

‘‘ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు.. మా జిల్లా నుంచి ఇసుక ఇవ్వడం వీలు కావడం లేదు..’’ 
– ఇది జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు ప్రత్యుత్తరం..?

సాక్షి, నిజామాబాద్‌: సంగారెడ్డి జిల్లా పరిధిలో నల్లవాగు ప్రాజెక్టు ఉంది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ పనులు చేపట్టాలంటే ఆ జిల్లాలో ఇసుక అందుబాటులో లేదు. దీంతో అక్కడి కలెక్టర్‌ హన్మంతరావు మన జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావుకు పక్షం రోజుల క్రితం లేఖ రాశారు. కోటగిరి మండలం పరిధిలోని కుమ్మరివాగు నుంచి ఇసుక తోడుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మొత్తం 9,500 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని రాశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎంరావు స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భూగర్భ గనుల శాఖను పురమాయించారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఆశాఖ అధికారులు అక్కడ ఇసుక అందుబాటులో లేదని, అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. ఈమేరకు ఇక్కడ ఇసుక లేదని నిజామాబాద్‌ కలెక్టర్‌ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణ కరోనా బులిటెన్‌.. 77 మందికి చికిత్స

లాక్‌డౌన్‌: ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు

ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!

లాక్‌డౌన్‌ : మద్యం బ్లాక్‌ దందా..

పోలీస్‌.. సెల్యూట్‌..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌