మండల కేంద్రంలో 24 గంటలపాటు కర్ఫ్యూ

11 Apr, 2020 13:50 IST|Sakshi

సాక్షి,  కామారెడ్డి : జిల్లాలో గత రెండు రోజులుగా ఒక్క కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇంతకముందు కరోనా పరీక్షలు నిర్వహించిన 31 మందికి తాజాగా నెగటివ్ వచ్చిందని. నేడు మరో 21 మంది రిపోర్టులను అధికారులు ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 10 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దొమకొండ ,ఎల్లారెడ్డిలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపించారు. దీంతో దొమకొండ, ఎల్లారెడ్డి క్వారంటైన్ ఖాళీ అయిపోయింది. కామారెడ్డి పట్టణంలోని  పాజిటివ్ కేసు నమోదు అయిన దేవునిపల్లిని పోలీసులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. జిల్లా అంతటా పక్కాగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. (అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్‌ )

మరోవైపు జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించిన 2,755 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇప్పటి వరకు 2,585 ద్విచక్ర వాహనాలు, 85 ఆటోలు, 85 నాలుగు చక్రాల వాహనాలను సీజ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ జాక్రన్ పల్లి మండల కేంద్రంలో సర్పంచ్‌ 24 గంటలపాటు స్వచ్ఛంద కర్ఫ్యూ ప్రకటించారు. ఈరోజు (శనివారం)ఉదయం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఒక్క రోజు కర్ఫ్యూకి ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు. (వారందరికీ నా ధన్యవాదాలు: ఆమిర్‌ ఖాన్‌ )

మరిన్ని వార్తలు