కనీస సమాచారం లేకపోతే ఎలా..!

18 Sep, 2019 09:34 IST|Sakshi
సమీక్షిస్తున్న జెడ్పీచైర్మన్‌ విఠల్‌రావు

ఎంప్లాయీమెంట్‌ అధికారిపై మండిపాటు

స్థాయీ సంఘ సమావేశంలో జెడ్పీ చైర్మన్, సభ్యుల ఆగ్రహం

ఉపాధికల్పన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలపై సమీక్ష

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా ఉపాధి కల్పన అధికారి మోహన్‌లాల్‌ తీరుపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్‌రావు, స్థాయీ సంఘ సభ్యులు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్థాయీసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా చేపడుతున్న  విధానాలను పేర్కొనాలని చైర్మన్‌ ఆదేశించారు. సం బంధిత అధికారి వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో చైర్మన్‌ సమావేశానికి వచ్చేటప్పుడు ఇలా గేనా వస్తారా అని ప్రశ్నించారు. ఎంప్లాయీమెం ట్‌ కార్యాలయంలో ఎన్ని ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి ఎందుకు టెండర్లు వే యడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగిన సమీక్షలో ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు, ఎన్ని పెండింగ్‌ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వ్యవసాయంపై సమీక్ష సమావేశం జరిగింది. రైతు బంధు పథకం అమలు, ప్రస్తుతం ఖరీఫ్‌కు పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ రజిత, సభ్యులు అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు